నాల్గో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు ఇదే
రేపటినుంచి బాక్సింగ్ డే టెస్ట్
మెల్‌బోర్న్: ఈనెల 26నుంచి ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్ట్‌కు జట్టును ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్‌బోర్డు(ఇసిబి) బుధవారం ప్రకటించింది. గాయం జోఫ్రా ఆర్చర్, ఓలీ పోప్ స్థానాల్లో బేథెల్, అట్కిన్సన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇసిబి ప్రకటించిన 11మంది ఆటగాళ్ల జాబితాలో బేథెల్, అట్కిన్సన్‌లకు చోటు లభించింది. జోఫా ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్, ఓలీ పోప్ స్థానంలో జాకబ్ బేథెల్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌ను మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆసీస్ జట్టు 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), క్రాలే, డకెట్, బేథెల్, రూట్, బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), విల్ జాక్స్, అట్కిన్సన్, కర్సే, టంగ్.



