Thursday, December 25, 2025
E-PAPER
Homeఆటలుచరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

- Advertisement -

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 343మ్యాచుల్లోనే 16వేల పరుగులు

న్యూఢిల్లీ: టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్‌ 16వేల పరుగుల మార్క్‌ను కేవలం 343 మ్యాచ్‌ల్లో నెలకొల్పాడు. విరాట్‌కు ముందు భారత్‌ తరఫున సచిన్‌ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్‌ 551 మ్యాచ్‌ల్లో 21,999 పరుగులు చేసి, లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గ్రహాం గూచ్‌ (22,211), గ్రేమ్‌ హిక్‌ (22,059) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్‌ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(131) సెంచరీ చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -