Thursday, December 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌..198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు గురువారం మరో కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీగా 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీగా 114 ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు వర్గాల పోస్టులకు నెలవారీ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఉండేలా నిర్ణయించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in‌‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అప్లికేషన్ ఫామ్ 2025 డిసెంబరు 30న ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అయితే, అభ్యర్థులు తమ అర్హత, నిబంధనలను ముందుగా జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాతే దరఖాస్తులు సమర్పించుకోవాలని బోర్డు సూచించింది. అర్హత ప్రమాణాలు, ఆన్లైన్ అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, అభ్యర్థులకు ఇచ్చిన సూచనలతో సహా పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో టీఎస్ఎల్‌ఆర్బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -