Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేగులగూడెం గ్రామ ప్రథమ పౌరురాలిగా పాగె ఆమని-సురేష్ బాధ్యతల స్వీకరణ

రేగులగూడెం గ్రామ ప్రథమ పౌరురాలిగా పాగె ఆమని-సురేష్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగుల గూడెం గ్రామ ప్రథమ పౌరురాలిగా గురువారం పాగే ఆమని-సురేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థిగా తనను దీవించి గెలిపించిన గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫలాలను అర్హులైన ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -