- Advertisement -
సొంత నిధులు అందజేసిన ఉపసర్పంచ్
నవతెలంగాణ – రామారెడ్డి
తాగునీటి సమస్యను పరిష్కరించడానికి నూతనంగా పదవి చేపట్టిన గండ్ర అంజయ్య సొంత నిధులతో బోరు మోటరు మరమ్మత్తు చేయించారు. మండలంలోని పోసానిపేట గ్రామంలో 9వ వార్డులో నీటి సమస్యను గుర్తించిన ఉపసర్పంచ్ అంజయ్య కేబుల్ వైర్ తోపాటు పలు సామాగ్రిని అందజేసి మరమ్మత్తు చేయించారు. ఈ సందర్భంగా అంజయ్య తో పాటు వార్డ్ మెంబర్ శిరీష నర్సింలకు వార్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



