Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధిహామీ కూలీలకు పెరిగిన పనిదినాలు

ఉపాధిహామీ కూలీలకు పెరిగిన పనిదినాలు

- Advertisement -

‘వీబీ- జీ రామ్ జీ’ గా పేరు మార్చిన కేంద్రం
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత, జీవనోపాధి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు పని దినాలు పెంచింది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ)గా మార్చింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. పనిదినాలతో పాటు రోజువారి వేతనాన్ని సైతం కేంద్రం పెంచింది. ఈ పథకం కింద హామీ ఇచ్చే పని దినాల సంఖ్యను ప్రతి సంవత్సరం 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచింది. ప్రతి సంవత్సరం కనీసం 125 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. గ్రామీణ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యం తో రోజువారి కనీస వేతనాన్ని రూ.240 పెంచింది. మండలంలో మొత్తం జాబ్ కార్డులు 8,495 ఉండగా ఇందులో కూలీలు 18,873 ఉండగా యాక్టివ్ కూలీలు 10,632 ఉన్నారు.

పథకం ప్రయోజనాలు..
ఈ పథకాన్ని గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని వారికి జీవనోపాధి భద్రతను పెంచడం లక్ష్యంగా మొదటగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 పేరుతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. తర్వాత మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ ఆర్జీఎస్) గా పేరు మార్చారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, చెరువుల తవ్వకం, నీటి సంరక్షణ, కాలువలు సృష్టించడం వంటి మౌలిక సదు పాయాల పనులను ఈ పథకం కింద చేపడతారు. గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, నగ రాలకు వలసలను తగ్గించడంతో పాటు గ్రామ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -