- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం ముల్కలకాల్వ గ్రామంలో గొర్రెల పెంపకానికి గురువారం ఉచిత నట్టల మందులు పంపిణీ చేశారు. వెటర్నరీ డాక్టర్ సుభాని సర్పంచ్ కొండ శ్వేత జోష్ గౌడ్ ఆధ్వర్యంలో గొర్రెలకు నట్టేలు వేశారు. ప్రభుత్వం అందించే నట్టేల పంపిణీనీ గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ షేక్ జనిపాష, గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొడ్డు వెంకన్న వార్డ్ నెంబర్స్ కుర్ర పిచ్చయ్య, కుర్ర లింగయ్య, భోగబోయిన వరప్రసాద్, శ్రీలోజు మట్టయ్య, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



