- Advertisement -
జప్తీవీర్పగూడెంలో ఘనంగా వేడుకలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలం లోని జప్తీవీర్పగూడెంలో క్రిస్మస్ వేడుకలో ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రాంగణంలో క్రిస్మస్ కేకే కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రేమ, త్యాగం కరుణ కల్గి ఉండాలని గ్రామ సర్పంచ్ అందుగుల వెంకటయ్య ఉప సర్పంచ్ పేలపోలు శ్రీనివాస్ అన్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీటీసీ వంకాయలపాటి రత్నకుమారి చలపతిరావు పేలపోలు సైదయ్య, పాస్టర్ రవి, పల్లపు ఉపేందర్, ఓర్సు సతీష్, మధు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



