నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా జట్లు ఈనెల 25 నుంచి 28 వరకు వరకు కరీంనగర్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి 72వ సీనియర్ కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. గురువారం ఉదయం కామారెడ్డి నుండి బాలుర విభాగం నుండి నిరంజన్ రెడ్డి (కెప్టెన్), సందీప్ కుమార్ (వైస్ కెప్టెన్), శివస్వామి, వంశీ, సుధకర్, శ్రావన్ రెడ్డి, గోపి, రవి కుమార్, వినోద్,ఆంజనేయులు, అశృత్ గౌడ్,ఆర్యన్ రాణా,వినోద్ లు,బాలికల విభాగం నుండి సంధ్య కెప్టెన్, భార్గవి,నికిత, సుచరిత, శృతి, వెన్నెల,పావని, అక్షయ, రీతికి, భావన, వరలక్ష్మి, అరుంధతి,నిహారిక,బీ.శృతి, రక్షిత బయలుదేరి వెళ్లారు.
క్రీడాకారులకు క్రీడ దుస్తులను డైరీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ కె ఎస్ ఉమాపతి స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ రంగ వెంకటేశ్వర్ గౌడ్, రిటైర్డ్ పిజికల్ డైరెక్టర్ ఆకుల నర్సింలు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బానాల భాస్కర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రధాన కార్యదర్శి నోముల మధుసూదన్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొక్కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



