Thursday, December 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

జన్నారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో సేవదాస్ నగర్ లో ఓలినిసి ప్రేయర్ హౌస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరిగింది. పాస్టర్ ఎం పురుషోత్తం  అదే విధంగా సంఘ సభ్యులు అంతేకాకుండా మరి ముఖ్యఅతిథిగా జన్నారము సేవాదాస్ నగర్ సర్పంచ్ నందు నాయక్ పాల్గొనడం జరిగింది. సంఘ పెద్దలు అందరు కూడా పాల్గొనడం జరిగింది.

జన్నారం మండలంలో క్రిస్మస్ కోలాహలం
జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్ సంబరాలు అట్టహాసంగా సగయీ. పండుగను పురస్కరించుకుని గురువారం క్రైస్తవులు ప్రధాన వీధుల్లో ఏసుప్రభు భక్తి గీతాల మధ్య భారీ ఊరేగింపులు నిర్వహించారు. చిన్నా పెద్ద అంతా కలిసి ఆడిపాడుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం ఇళ్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మిన్నంటిన క్రిస్మస్ సంబరాలు
జన్నారం మండల వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మండల కేంద్రంతో పాటు కలమడుగు, మందపల్లి, కిష్టాపూర్ తదితర గ్రామాల్లోని చర్చిలు కిక్కిరిసిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు జన్మవృత్తాంతం, ఆయన చేసిన త్యాగాలను ఫాదర్లు వివరించారు. పల్లెల్లో ఎటు చూసినా పండుగ సందడి కనిపిస్తోంది. చిన్నాపెద్ద శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -