నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మెస్రం రాజ్ కుమార్, ఉప సర్పంచ్ సిపెల్లి రాజన్న వార్డు సభ్యులు గ్రామస్తులు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో చేరిన రైండ్లగూడ ఉప సర్పంచ్
జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ ఉపసర్పంచ్ చెట్పల్లి భూపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉట్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ అల్లం రవి, మాజీ ఎంపిటిసి అల్లం వెంకట్రాజం, చెవుల గంగాధర్, కిరణ్ చెట్పల్లి గంగన్న, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



