నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గన్ పూర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఐదవ అంతస్తులో నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యత్వం, యూనియన్ బలోపేతం, 2026 నూతన సంవత్సర క్యాలెండర్, నూతన జిల్లా కమిటీ ఎన్నిక, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్తు కార్యక్రమాలు, ఇతరములు పై చర్చించారు. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల్లో ప్రధానంగా క్షేత్రస్థాయిలో సంచరించే ఉద్యోగులకు ఆన్లైన్ అటెండెన్స్ ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుమారు 30 సంవత్సరాల నుండి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న వారికి ఇంకా పదోన్నతులు లభించడం లేదని, సీనియర్ అయ్యుండి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తూ ఎల్ హెచ్ వి శిక్షణ పొందలేదని యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ నిలిపివేయడం సరికాదని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.
ఈ సమస్యలన్నింటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేట్ అధక్షులుగా ఏ యాదమ్మ, జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ రెడ్డి, బేబీ రాణి, రవి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా గంగామణి, మండోదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి విమలేశ్వరి,సొలోమోన్ రాజ్, ఏస్.స్వామి, జి సురేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగాఎస్ శ్యామల, విజయ ,సుధాకర్,రమేష్, మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా నూతన కమిటీ ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తూ ఉద్యోగుల సంక్షేమంపై పాటుపడతామని తెలియజేశారు.



