నవతెలంగాణ – ఆలేరు
జనగాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఎంపీ అభినందించినట్లు చెప్పారు.రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఐక్యమత్యంతో పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని సూచన చేసినట్లు చెప్పారు.పట్టుదలతో ఐక్యమత్యంతో పని చేసిన చోట కాంగ్రెస్ పార్టీ 70 నుండి 80% ఒక మండలంలో గెలుచుకున్న ఉదాహరణలు చెప్పినట్లు తెలిపారు.
ప్రజలు ఇచ్చిన సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను నిస్వార్ధంగా పని చేసి అటు ప్రజల్లో మీరు వ్యక్తిగతంగా పలుకుబడిని పెంచుకోవడంతో పాటు పార్టీ ప్రతిష్ట పెరుగుతుందనీ సూచన ఇచ్చారన్నారు. ఎంపీ ని కలిసిన వారిలో ఎర్రగుల్లపాడు నుండి చిర్ర సత్యనారాయణరెడ్డి, తరిగొప్పుల నుండి జ్యోతి మధుసూదన్, మరిగడి నుండి కర్రే పరుశరాములు, చౌడారం నుండి కర్ల పద్మ, పెద్దతండ నుండి నరసింహ, ఎర్రకుంట తండ రమావత్, శ్రీకాంత్, ఇటుకలపల్లి నుండి జెర్రీపోతుల రాజు అలాగే ఉపసర్పంచ్లు వార్డు మెంబర్లు లకు అభినందించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డి జనగామ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడల సిద్ధయ్య గౌడ్ ఆర్టిఏ నెంబర్ అభి గౌడ్ మాజీ సర్పంచులు భైరగొని చంద్రం తదితరులు పాల్గొన్నారు.



