నవతెలంగాణ – ముధోల్
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాట పడుతున్నాయని ముధోల్ మండల సర్పంచ్ లఎన్నికల బిజెపి ఇంచార్జ్ పట్టే పురం మోహన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎన్నికైన సర్పంచులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచాయతీ లకు కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రామల అభివృద్ధి కే కేంద్ర ప్రభుత్వం ప్రాదన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఒత్తిడి తేవాలని సూచించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు సహకారం తో గ్రామల అభివృద్ధి కి బాటలు వేద్దాం అన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ లు , ఉపసర్పంచ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు , బిజేపి నాయకులు, పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
- Advertisement -
- Advertisement -



