- Advertisement -
నవతెలంగాణ- జన్నారం
10 టీవీ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన (గ్రామ స్వరాజ్యం) అనే సర్పంచుల సమ్మేళనానికి జన్నారం మండలం లోతుర్రై గ్రామ సర్పంచ్ బోడ శంకర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోడ శంకర్ లోతరే గ్రామంలో ఉన్న సమస్యలపై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా గూడ శంకర్ను సన్మానించి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చేతుల మీదుగా మెమొంటోనీ అందజేశారు. గ్రామపంచాయతీ సమస్యలను 10టివి వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. మారుమూల ప్రాంతం నుండి తనకు ఆహ్వానం అండదంపట్ల హర్షం వ్యక్తం చేశారు. శంకర్ స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సహకారంతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. అందులో మీడియా సహకారం కూడా ఎంతో అవసరమన్నారు.
- Advertisement -



