- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ వ్యాప్తంగా జీసస్ క్రీస్తు జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25 జరుపుకునే క్రిస్టమస్ ను గురువారం మండల వ్యాప్తంగా భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. మండలంలోని పాతల్లిగూడెం సీయోను ప్రార్ధనా మందిరంలో పాస్టర్ సున్నం సీయోను ఆద్వర్యంలో జరిగిన ప్రార్ధనా కార్యంలో స్థానిక సర్పంచ్ కుంజ శ్రీను పాల్గొని మండల ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు నడ్డి దేవదాస్,నెహ్రూ,స్థానిక ఉప సర్పంచ్ కేరం మంగ,మాజీ ఉప సర్పంచ్ బాబురావు,కాంగ్రెస్ నాయకులు నండ్రు రమేష్, ములగలంపల్లి రాజు, ఎల్.రాజు, శేఖర్, రాందాసు, సంఘ పెద్దలు గ్రామస్తులు,యువత,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -



