Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

- Advertisement -

– రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి 
– చౌట్ పల్లి పంచాయతీ పాలకవర్గం అభినందన సభ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి  
జిల్లాలో చౌట్ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులు తమ వంతుగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు కేతిరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌట్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులకు నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలోనే చౌట్ పల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేలా బాధ్యతగా వ్యవహరించాలని హితువు పలికారు.

 గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన మహబూబ్, ఉప సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన గ్రామంలో వివిధ పనుల కోసం తన ఎంపీ లాండ్స్ నిధుల నుండి రూ. 37 లక్షలు మంజూరు చేస్తూ పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను సభలోనే గ్రామస్తులకు అందజేశారు. అనంతరం సర్పంచ్ మహబూబ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సురేష్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డిని పాలకవర్గ సభ్యులతో పాటు పలువురు శాలువాలతో సత్కరించి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహబూబ్, ఉప సర్పంచ్లు సట్టా విశాల్, అల్లకొండ ప్రదీప్, వార్డు సభ్యులు చిట్యాల దేవేందర్, మేడిపల్లి రిక్విత్, దుంప ప్రశాంతి, బుర్ర దివ్య రాణి, పుప్పాల అలేఖ్య, కొట్టాల పద్మ, ఏలేటి స్వరూప, కాలేవర్ గణేష్, సామర చిన్న మురళి, ముద్దుల మురళి, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, మాజీ సర్పంచ్ మారు శంకర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, నాయకులు గోపిడి లింగారెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -