Thursday, December 25, 2025
E-PAPER
Homeఆటలుఇంగ్లండ్ కోచ్‌గా రవిశాస్త్రి.. మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లండ్ కోచ్‌గా రవిశాస్త్రి.. మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలవ్వడం ఆ జట్టు నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. కేవలం 11 రోజుల్లోనే సిరీస్ కోల్పోవడంతో ప్రస్తుత హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ను మార్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే ఇంగ్లండ్ జట్టుకు సరైన మార్గనిర్దేశం చేయగలడ‌ని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో సరిగ్గా తెలిసిన వ్యక్తి ఎవరు అని ఆలోచించాలి. మానసికంగా, శారీరకంగా, వ్యూహాత్మకంగా ఆసీస్ బలహీనతలను ఎలా ఉపయోగించుకోవాలి? దీనికి రవిశాస్త్రి సరైన వ్యక్తి. ఆయనే ఇంగ్లండ్ తదుపరి హెడ్ కోచ్ కావాలి” అని పనేసర్ స్పష్టం చేశాడు.

మెకల్లమ్ ప్రవేశపెట్టిన దూకుడైన ‘బజ్‌బాల్’ వ్యూహం తొలినాళ్లలో ప్రశంసలు పొందినా, ఇటీవల కాలంలో స్వదేశంలో, విదేశాల్లోనూ ఘోరంగా విఫలమవుతోంది. 2024 ఆరంభం నుంచి ఇంగ్లండ్ 12 టెస్టులు గెలిస్తే, 13 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. ఈ గణాంకాలు మెకల్లమ్ పద్ధతులపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -