- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని శివన్నగూడ గ్రామంలో పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్,ఎంబి హెర్మోన్ చర్చ్ లో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చర్చి పెద్దల ఆహ్వాన మేరకు శివన్నగూడ గ్రామపంచాయితీ సర్పంచ్ రాపోలు యాదగిరి హాజరై సంఘ పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, క్షమించే గుణం నేర్పే క్రీస్తు బోధలు మానవ అభ్యున్నతికి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సుధాకర్, సంఘస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



