Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

కాటారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

- Advertisement -

లోకానికి వెలుగులు నింపడానికి యేసు వచ్చాడు: పాస్టర్ సురేష్
నవతెలంగాణ – కాటారం

ప్రపంచ మానవాళిని ప్రేమించి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడని పాస్టర్ సురేష్ అన్నారు. గురువారం గారేపల్లిలోని రివైవ్ చర్చి నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చూపిన ప్రేమ శాంతి మార్గంలో నడవాలని సూచించారు. సర్వ మానవాళి పాపాలు తీసివేయ్యానికి యేసు ప్రభు వచ్చాడని అన్నారు. క్రైస్తవ పెద్దలు నాయకుల కోసం ప్రజల కోసం దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒక్కరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు వెంకటస్వామి అనిల్ ఎల్లన్న రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -