మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాజా మాజీ చైర్మన్ ఇప్ప మొoడయ్య మానవత్వం చాటుకున్నారు. మండలంలోనిఅడ్వాలపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందింన కొత్తపల్లి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు.వైద్య ఖర్చల నిమిత్తం డబ్బులు లేకపోవడంతో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో వైద్య ఖర్చుల కోసం ఏల్ఓసి ఇప్పించారు. సుమన్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అయితే ఆసుపత్రి యాజమాన్యం రోగికి డిచార్జ్ చేసి రూ.8.50 లక్షల బిల్లు కట్టాలని చెప్పడంతో రోగి బంధువులు పేదలు కావడంతో లబోదిబోమంటూ మొoడయ్య దృష్టికి తీసుకరాగ అతను మంత్రికి విన్నవించారు. ఈ నేపథ్యంలో దయనియతో మంత్రి ఆసుపత్రి యజమాన్యంతో మాట్లాడి నైయా పైసా తగలకుండా నోడ్యూ బిల్లును ఇప్పించారు. ఇందుకు మంత్రికి మొoడయ్య తోపాటు మృతుని బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మానవత్వం చాటుకున్న మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



