Friday, December 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలువినోదభరితంగా 'జెట్లీ'

వినోదభరితంగా ‘జెట్లీ’

- Advertisement -

హాస్యనటుడు సత్య, దర్శకుడు రితేష్‌ రానా ‘జెట్లీ’ సినిమాతో అలరించబోతున్నారు. క్లాప్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నారు. మేకర్స్‌ క్రిస్మస్‌ విషెస్‌ అందిస్తూ ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. రితేష్‌ రానా అద్భుతమైన నేరేషన్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విజన్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యాకింగ్‌ అన్నీ కలిసి ఈ సినిమా ఓ అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ కానుంది. ఈ సినిమాతో మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి డైలాగ్స్‌: రితేష్‌ రానా, సంగీతం: కాల భైరవ, డీఓపీ : సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నార్ని శ్రీనివాస్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ: వింగ్‌ చున్‌ అంజి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -