Friday, December 26, 2025
E-PAPER
Homeసినిమా'సూడు సూడు మల్లేషు..'

‘సూడు సూడు మల్లేషు..’

- Advertisement -

అవినాష్‌ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘వానర’. సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్‌. నందు ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్‌ స్క్రీన్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై అవినాష్‌ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మైథలాజికల్‌ రూరల్‌ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా న్యూ ఇయర్‌ సందర్భంగా జనవరి 1న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘లబొరే లబొరే..’ రిలీజ్‌ చేశారు. ఈ పాటను మంచి బీట్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగర్‌ కంపోజ్‌ చేశారు. భరద్వాజ్‌ గాలి సిచ్యువేషన్‌కు తగిన లిరిక్స్‌ అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, సాయి మాధవ్‌ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘సూడు సూడు మల్లేషు, జుర్రుకుంటా పుల్లైసు, మన వానర వీరుని కహానీ, ఆ లంకను భయపెట్టిన శివుడిని, అరె తోక తోటి కొట్టింది, సింహిక పనిపట్టింది, అనిలాత్మజ హనుములవారే, అరె జెండాపై కపిరాజే రే, లబొరే లబొరే లబ లబ లబ….’ అంటూ సాగే ఈ పాట అందర్నీ ఇట్టే అలరిస్తోంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -