మా.. తోటలను పరిశీలించిన నాబార్డ్ అధికారులు

నవతెలంగాణ-గోవిందరావుపేట: మండలంలోని మేడారం, నార్లాపూర్, రంగాపూర్ గ్రామాల్లో గురువారం నాబార్డ్  సహకారంతో వనసమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతోటలను నాబార్డ్ అధికారులు ఏజీఎం స్వాతి తివారి హైదరాబాద్, డిడిఎం రవి లు  సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు గిరిజన రైతులకు పండ్ల తోటల పెంపకంపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే గిరిజనుల జీవనోపాదుల యూనిట్స్ లలో కన్నెపల్లి గ్రామంలో టైలరింగ్ యూనిట్, పాడిపశువుల యూనిట్ ను   ప్రారంభించారు. అలాగే వనసమాఖ్య పస్రా కార్యాలయం లో కార్యక్రమంలో నిర్వస్తున్న పలు రికార్డులు ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనసమాఖ్య సీఈవో శ్రీనివాసులు కోఆర్డినేటర్  రమేష్  లీడర్లు రైతులు పాల్గొన్నారు.
Spread the love