Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅంతరాలు సృష్టించిన మనుస్మృతిని అంతం చేయాలి

అంతరాలు సృష్టించిన మనుస్మృతిని అంతం చేయాలి

- Advertisement -

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆ గ్రంధం దహనం: కేవీపీఎస్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జీ రాములు, టి సాగర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మనుషుల మధ్య అసమానతలు సృష్టించిన మనుస్మృతిని మట్టిలో పాతిపెట్టాలని కేవీపీఎస్‌ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి రాములు, టి సాగర్‌ పిలుపునిచ్చారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మనుస్మృతి గ్రంధాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుస్మృతి, దాని భావాజాలాన్ని మట్టుపెట్టకపోతే మరో వెయ్యేండ్లయినా ప్రజల మధ్య ఐక్యత అసాధ్యమని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ విధానాలవల్ల అసమానతలు స్థిరపడు తున్నాయని తెలిపారు. మనుషుల మధ్య అంతరాలకు మూలమైన ఆ భావాజా లాన్ని నాశనం చేయాలని పేర్కొన్నారు.

అసమానతలను స్థిరపరచడానికి చాతుర్వర్ణ వ్యవస్థను సమాజంపై రుద్దిందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేనీ కుల వ్యవస్థను దోపిడీ సాధనంగా పేదల ఐక్యతకు ఆటంకంగా కొనసాగిస్తుందని చెప్పారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబుతో పాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్‌ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ్, కేవీపీఎస్‌ నగర నాయకులు కొమ్ము విజయ్, ఎం మహేందర్‌ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు, నగర నాయకులు జి.రాములు బి పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు లెనిన్‌ గువేరా కడమంచి రాంబాబు, సోమన్న, నాగేందర్‌, మోహన్‌, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -