విజయవాడ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు ఆర్థిక సహాయం అందించింది. విజయవాడలో ఏర్పాటు చేసిన ‘ఎస్‌హెచ్‌జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్”కు ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ వి చంద్రశేఖరన్, హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్ కుమార్, విజయవాడ జోనల్ జనరల్ మేనేజర్ ఎం రాజేష్, ఉన్నతాధికారులు గౌరి శంకర్, ఎఎన్ వి నాంచార రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు ఎస్‌హెచ్‌జీలకు చెక్కులను అందజేశారు.
విజయవాడ జోనల్ మేనేజర్ ఎం. రాజేష్ మాట్లాడుతూ.. జోనల్‌లోని స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచ్‌లు ఉన్నాయని తెలిపారు. ఇండియన్ బ్యాంక్ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో సుమారు 5000 ఎస్‌హెచ్‌జిలకు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. తమ 43 శాఖలు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇండియన్ బ్యాంక్ రూ.1150 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు మంజూరు చేసిందని తెలిపారు.
ఎస్‌హెచ్‌జీలకు ఇండియన్ బ్యాంక్ ఆర్థిక మద్దతు
- Advertisement -
- Advertisement -



