- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ క్లాస్‌లో 215KM లోపు జర్నీపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆపై ప్రయాణం చేసేవారికి ప్రతి KMకు పైసా చొప్పున, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ AC, AC తరగతుల్లో ప్రతి KMకు 2 పైసల చొప్పున పెంచారు. సబర్బన్ సర్వీసులు, సీజనల్ టికెట్ల ఛార్జీల్లో మార్పులు లేవు. ఈ మేరకు రైల్వే నోటిఫై చేసింది. ఈ ఏడాదిలో ఛార్జీలను 2 సార్లు పెంచింది.
- Advertisement -



