- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కెనడాలోని టొరంటోలో భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థిని దుండగులు కాల్చి చంపారు. స్కార్‌బొరౌగ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్‌ను హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితులు పారిపోయారు. దర్యాప్తు నేపథ్యంలో తాత్కాలికంగా కళాశాల క్యాంపస్‌ను మూసివేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
- Advertisement -



