నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పది సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ఆ దేశ ప్రత్యేక ప్రాసిక్యూటర్ కోర్టును అభ్యర్థించినట్లు స్థానిక మీడియా శుక్రవారం తెలిపింది. మార్షల్ లా విధించేందుకు యత్నించడం, అనంతరం ఆయనను అరెస్ట్ చేయడానికి జరిగిన ప్రయత్నాలను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై ఈ శిక్ష విధించాలని కోరారు. యూన్ ఎదుర్కొంటున్న పలు ఆరోపణలపై ప్రత్యేక ప్రాసిక్యూటర్ కోరిన మొదటి జైలు శిక్ష ఇది.
జనవరి 3న కొద్ది గంటల పాటు దేశంలో సైనిక పాలన విధించి దేశంలో రాజకీయ సంక్షోభానికి కారణమయ్యారు. ఆయనను అభిశంసిస్తూ ప్రతిపక్షం నేతృత్వంలోని నేషనల్ అసెంబ్లీ ఓటు వేయడంతో అధికారం నుండి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్న దర్యాప్తు అధికారులను తన భవనంలోకి రాకుండా బారికేడ్లతో అడ్డుకున్న సంగతి తెలిసిందే.



