Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్లకు ఊరట.!

సర్పంచ్లకు ఊరట.!

- Advertisement -

చిన్న జీపీలకు రూ.5 లక్షలు.. పెద్ద జీపీలకు రూ.10 లక్షలు
నవతెలంగాణ – మల్హర్ రావు

“గ్రామాల అభివృద్ధికి సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచ్లకే నిధులు ఇస్తా. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు మంజూరు చేస్తా. కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటికి సంబంధం లేదు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సర్పంచుల్లో ఉత్సాహాన్ని నింపింది.మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా..వీటిలో అన్ని గ్రామాలు జీరో బ్యాలెన్స్ తో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చుకోలేని స్థితి ఉంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం.. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేపట్టడానికి ఎలా ముందుకు వెళ్లాలని నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు.

స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆలోచిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే గ్రామ పంచాయతీలకు సీఎం నిధుల నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వనుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడుగులు పడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.

రెండేళ్లుగా స్థబ్దత..
రెండు సంవత్సరాలుగా జీపీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేకాధికారులు భారంగా నెట్టుకు వచ్చారు.చాలా గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బును సౌకర్యాల కల్పన కోసం వెచ్చించారు.15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అప్పులు తెచ్చి కార్యదర్శులు పనులు చేపట్టారు.

అభివృద్ధి పనులకు వెచ్చిస్తాం: బండారి,నర్సింగరావు… పెద్దతూండ్ల సర్పంచ్
ముఖ్యమంత్రి ఇస్తానన్న రూ.10 లక్షలతో కొంతైనా గ్రామాల అభివృద్ధికి ఆవకాశం ఉంటుంది. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది వేతనాలను చెల్లిం చిన తర్వాత మిగులు నిధులను ప్రజల కనీస అవసరాలకు వినియోగిస్తాం.పారదర్శకంగా నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -