నవతెలంగాణ- ఆర్మూరు
పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు నరేందర్ నాగరాజు, శ్రీధర్, అఖిల్, మాట్లాడుతూ.. పట్టణంలోని విధులకు నిబంధనగా శ్రీ చైతన్య పాఠశాలను నడుపుతున్నారని, బాక్స్ డే రోజు కూడా క్లాసులను నిర్వహించడం ప్రభుత్వ ఉల్లంఘనను పాటించకపోవడం అనేది కారణమని అన్నారు. గతంలో ఈ చైతన్య పాఠశాల పై నిబంధనకు విరుద్ధంగా నడుపుతున్నారని, ఎన్నిసార్లు విద్యార్థి సంఘాలుగా విద్యాశాఖ అధికారి ఎంఈఓ విన్నవించినా, వినతి పత్రాలు ఇచ్చిన విద్యాశాఖ అధికారి చూసి చున్నట్లు విహరించడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి నడపబడుతున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృత్తం కాకుండా విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. స్కూల్ కి గ్రౌండ్ కూడా లేదు.. పక్కకు ఉన్న చైతన్య పాఠశాల సెకండ్ బ్లాక్ పర్మిషన్ లేకుండా క్లాస్ నిర్వహిస్తున్నారు. వీటి పైన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ పిడిఎస్యు ఎన్ ఎస్ యు ఐ తదితర నాయకులు పాల్గొన్నారు.
చైతన్య స్కూల్ ను సీజ్ చేయాలి: విద్యార్థి సంఘాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



