- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలో శుక్రవారం 108 అంబులెన్స్ ను ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, జిల్లా కోఆర్డినేటర్ స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా అంబులెన్స్ లోని పరికరాల పనితీరు, చికిత్సకు కావలసిన మందులను పరీక్షించారు. అంబులెన్స్ సిబ్బంది అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మండల పరిధిలో అత్యవసర పరిస్థితులకు 108 అంబులెన్స్ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీకాంత్, గణేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



