- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మద్దికుంటలో శుక్రవారం జీవాలకు నట్టలు నివారణ మందులను స్థానిక ఉపసర్పంచ్ ముత్యాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జీవాలకు తగు సమయంలో నట్టల నివారణ మందులు తప్పకుండా వేయించాలని సూచించారు. దాదాపు 1200 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తాండ్ర రామస్వామి, గుండెబోయిన బాలయ్య, వైద్యులు నారాయణ, రమేష్, బాలమణి, ఆంజనేయులు, హారిక, స్వామి, రైతులు ముత్యాల రాజు, శివ కుమార్, భాస్కర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



