– నాగాపూర్ సర్పంచ్ కొంపదండి అశోక్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గోర్లు మేకల కాపరులు తమ జీవాలకు తప్పనిసరిగా నట్టాల నివారణ ధావనాన్ని తాగించాలని సర్పంచ్ కొంపదండి అశోక్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో పశు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ అశోక్ పలు జీవాలకు నటన నివారణ ద్రావణాన్ని వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గ్రామంలోని గొర్ల మేకల కాపరులు తమ జీవాలకు తప్పకుండా నట్టల నివారణ ద్రావణాన్ని వేయించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని గొర్ల మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉల్లెంగుల శశిధర్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు, వెటర్నరీ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి, వార్డు సభ్యుడు సురేష్, అంజయ్య, మల్లికార్జున, భాను, బొర్రన్న, పెద్దకుర్మా నర్సయ్య, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.
గొర్రె మేకలకు నట్టల నివారణ ద్రావణం తాగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



