Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలి

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలి

- Advertisement -

– మండల టీఎస్ యుటిఎఫ్ కమిటీ పిలుపు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఈ నెల 28,29 తేదీల్లో జనగామలో జరుగనున్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభలను విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. మండల టీఎస్ యుటిఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో మండల టీఎస్ యుటిఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఏ. వెంకట యాదవ్,ప్రధాన కార్యదర్శిగా ఎం.డి. సయ్యద్,కోశాధికారిగా అంజయ్య ఎన్నికయ్యారు. అలాగే మండల కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి ఎం.డి. సయ్యద్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యా విధానాలపై ఉపాధ్యాయులు చర్చించుకునే కీలక వేదికగా రాష్ట్ర విద్యా మహాసభలు నిలుస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులు,ప్రభుత్వ విద్య పరిరక్షణ,విద్యా రంగ సమస్యలపై గట్టిగా స్వరం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. జనగామలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా మహాసభలకు మండలంలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -