- Advertisement -
ఆనాటి ఆహారపు అలవాట్లే ఈనాటి శక్తి
నవతెలంగాణ – రామారెడ్డి
నేటి కలుషిత వాతావరణం, ఆహారపు అలవాట్లతో ఎప్పుడు ఏ వ్యాధి ఏ వయసు వారికి వస్తుందో తెలియని రోజులు ఇవి. కానీ 80 సంవత్సరాల వయసులో అలుపు సొలుపు లేకుండా వ్యవసాయం చేస్తున్న ఓ పెద్దవ్వ ఎలాంటి అనారోగ్యం లేకుండా బతుకుతుంది. రామారెడ్డి మండలంలోని గొడుగుమర్రి తాండ కు చెందిన భూక్య ధరిమి ఓ కొడుకు, ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి, ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తుంది. ఆనాటి మక్క రొట్టెలు, గట్క, తైద అంబలి, అడవిలో దొరికే సీజనల్ పండ్లు, పంట చేనులలో పండే కూరగాయలు, తీసుకునే వారమని, ఇప్పటికీ బోరు నీళ్లు, పొలంలో పాండే కూరగాయలు తీసుకుంటున్నామని ఆరోగ్య రహస్యాన్ని తెలిపారు.
- Advertisement -



