బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య
నవతెలంగాణ -పెద్దవంగర
రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఇటివల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్ లకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరవుతున్నారని, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, సోమనర్సింహారెడ్డి, శ్రీరాం సంజయ్, కనుకుంట్ల వెంకన్న, సుధీర్, వెంకన్న, రవి, వెంకట్ రెడ్డి, గోపాల్ నాయక్, అనుదీప్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ సభకు భారీగా తరలిరావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



