నవతెలంగాణ – ఆర్మూర్
రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లి గ్రామంలో గల మహేశ్వర మహా పిరమిడ్,పత్రీజీ శక్తి స్థల్,కైలాసపురిలో ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ధ్యాన మహా యాగం ఈనెల 31 డిసెంబర్ అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పి ఎస్ ఎస్ ఎమ్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ కేదార నంద స్వాములవారు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ప్రపంచ శాంతి కొరకు 11 రోజులపాటు లక్షలాదిమంది ధ్యాన బంధువుల చేత నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీశ్రీ కేదార్నంద స్వాముల వారిని మహేశ్వర మహా పిరమి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సభ్యులు దామోదర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జిల్లా నుండి సుమారు 5000 మంది పాల్గొన్నారు అని, ట్రస్ట్ తరపున జిల్లా నుండి విచ్చేసిన ధ్యాన బంధువుల సౌకర్యార్థ ప్రత్యేక వసతిని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం బాధ్యులు తిరుమల గంగారం, బొడ్డు దయానంద్,మామిడి లక్ష్మారెడ్డి,సబ్బాని సుదర్శన్,పోలీస్ గంగారెడ్డి,వెల్మల్ భూమన్న తదితరులు పాల్గొన్నారు.



