ఎస్ ఎఫ్ ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మం పాటి శంకర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఎస్ఎఫ్ఐ నల్లగోండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగ్య గోప సముద్రం సీపీఐ(ఎం) సర్పంచ్ గా గెలుపొందిన ముడావత్ సరస్వతి రవి నాయక్ లను ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యారంగం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై అనేక పోరాటాలు నిర్వహించి గత కోంత కాలంగా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పై గోంతెత్తి అనేక పోరాటాలు నిర్వహించడంతో భాగ్య గోప సముద్రం గ్రామ ప్రజలు అంగం బలం, అధికార బలం, ఆర్థిక బలం లేక్క చేయకుండా నిరంతరం మా సమస్యలు పరిష్కారం కోసం పోరాడే ముడావత్ సరస్వతి రవి నాయక్ ను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో ఏకమై గెలిపించడం జరిగిందని అన్నారు.
ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్ లో ప్రజా సమస్యలపై విద్యార్థి సంఘం అందించిన స్పుర్తితో బలమైన పోరాటాలు చేసీ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లచ్ఛిరాం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షా, కార్యదర్శులు మూడవత్ జగన్ నాయక్ కుర్ర సైదా నాయక్ నాగార్జున సాగర్ డివిజన్ అధ్యక్షుడు నల్లబెల్లి జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు ధీరావత్ వీరన్న, న్యూమన్ తదితరులు పాల్గొన్నారు.



