Saturday, December 27, 2025
E-PAPER
Homeకరీంనగర్జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే సహించేది లేదు

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే సహించేది లేదు

- Advertisement -

– టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా
నవతెలంగాణ – వేములవాడ

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్ 143) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన జీవో నెంబర్ 252 వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ జీవో కారణంగా డెస్క్ జర్నలిస్టులు, కేబుల్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా విస్మరించిందని, మెజారిటీ జర్నలిస్టుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నూతనంగా విడుదల చేసిన జీవో 252ను వెంటనే సవరించకపోతే, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని లాయక్ పాషా స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నరసయ్య, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, అబ్దుల్ జబ్బర్, దెబ్బేటి ప్రవీణ్, చేకూర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -