Saturday, December 27, 2025
E-PAPER
Homeబీజినెస్పెట్టుబడి ప్రయాణంలో ఫోన్‌పే వెల్త్ కొత్త అధ్యాయం

పెట్టుబడి ప్రయాణంలో ఫోన్‌పే వెల్త్ కొత్త అధ్యాయం

- Advertisement -

– మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ₹10 తో పెట్టుబడి పెట్టేందుకు ‘డైలీ SIP’ ప్రారంభం.

– ఈక్విటీ, మల్టీ-ఆస్తి, గోల్డ్ ఫండ్స్ మొదలైన వర్గాలలో పెట్టుబడి పెట్టండి.

నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫోన్‌పే వెల్త్) నేడు మ్యూచువల్ ఫండ్స్‌లో ‘డైలీ SIP’ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు తమ ఫోన్‌పే యాప్ ద్వారా ప్రతి రోజు కేవలం ₹10 కూడా నేరుగా పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. ఈ సౌకర్యం భవిష్యత్ పెట్టుబడిదారులకు తమ రోజువారీ పొదుపును సులభంగా పెట్టుబడిగా మార్చుకోడానికి అలానే ఎక్కువ మంది భారతీయులు కాలక్రమేణా సంపదను పెంచుకోవడానికి సహాయపడుతుంది.

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ రంగం వేగవంతమైన వృద్ధిని చూస్తోంది, ముఖ్యంగా SIPలలో ఈ వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) ప్రకారం, అక్టోబర్ 2025 నాటికి నెలవారీ SIP ఇన్‌ఫ్లోలు ₹29,000 కోట్లకు పైగా పెరిగాయి – ఇది గత ఐదేళ్లలో 30% కంటే ఎక్కువ వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ఈ పెరుగుదల నిలకడగా పెరుగుతున్న SIP అకౌంట్ల సంఖ్యలో కూడా కనిపిస్తోంది, ఇది అక్టోబర్ 2025 నాటికి 9.45 కోట్లకు చేరుకుంది. ఇది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో కాలానుగుణంగా పెట్టుబడులు పెట్టడానికి, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడికి ఇచ్చే బలమైన ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

ఈ మేరకు, డైలీ SIPల ప్రారంభం ద్వారా వినియోగదారులు రోజుకు కేవలం ₹10తో కూడా పెట్టుబడి పెట్టడానికి వీలవుతుంది. రోజువారీ నగదు ప్రవాహాలు & పొదుపులు ఉన్న వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మరింత సౌకర్యవంతంగా మరియు సరసమైనవిగా మారుతాయి, ఇది ఆర్థిక సంపదను నిర్మించడంలో తొలి అడుగు అవుతుంది.

డైలీ SIP ముఖ్య లక్షణాలు:

చిన్న పెట్టుబడి పెట్టే అంకితభావం: రోజుకు కనిష్టంగా ₹10 తో, ఎవరైనా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా సంపదను పెంచడం ప్రారంభించవచ్చు. ప్రారంభించడం సులభం: ఫోన్‌పే యాప్‌లో UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఆటోపే ద్వారా తక్షణమే డైలీ SIPని ప్రారంభించవచ్చు, దీనితో సున్నితమైన, ఆటోమేటెడ్ రోజువారీ పెట్టుబడి సాధ్యమవుతుంది.

విభిన్న ఫండ్ ఎంపికలు: వినియోగదారులు ఈక్విటీ ఫండ్, గోల్డ్ ఫండ్, మల్టీ-యాసెట్ ఫండ్స్ వంటి వివిధ పెట్టుబడి అవసరాలు అలానే రిస్క్ సామర్థ్యాలకు అనుగుణంగా జాగ్రత్తగా ఎంపిక చేయబడిన మ్యూచువల్ ఫండ్స్ నుండి ఎంచుకోవచ్చు.

పెట్టుబడి అమౌంట్​లో అనుకూల మార్పులు: ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించే పెట్టుబడిదారులు తమ సౌలభ్యం అలానే వ్యక్తిగత పెట్టుబడి లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి అమౌంట్​ని పెంచే లేదా తగ్గించే వీలు ఉంది.

సులభంగా నిలిపివేయడం: ఒక పెట్టుబడిదారుడు ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించలేరని భావిస్తే, వారు తమ SIPలను సులభంగా నిలిపివేయడానికి అలానే పెట్టుబడి పెట్టిన డబ్బును పెరగడానికి అనుమతించే వెసులుబాటు వారికి ఉంది.

ప్రారంభోత్సవ సమయంలో, Share. Market (ఫోన్‌పే వెల్త్) ఇన్వెస్ట్‌మెంట్ ప్రోడక్ట్స్ అధిపతి నీలేష్ డి నాయక్ మాట్లాడుతూ, “డైలీ SIPలతో, మేము లక్షలాది భారతీయులకు పెట్టుబడులను మరింత అలవాటుగా మారుస్తున్నాము. రోజువారీ పెట్టుబడుల ద్వారా, పెట్టుబడిదారులు, రూపాయి సగటు విలువ ప్రయోజనాన్ని పొందుతారు, ఇది తాత్కాలిక మార్కెట్ అస్థిరతను అధిగమించడంలో సహాయపడుతుంది. రోజుకు ₹10 పెట్టుబడి కూడా క్రమశిక్షణతో, దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది అలానే దీర్ఘకాలిక సంపద సృష్టించడంలో సహాయపడుతుంది. ఈ ఉత్పత్తితో పెట్టుబడులను సులభతరం చేయడం అలానే ప్రతి భారతీయుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం కావడానికి సహాయపడటమే మా లక్ష్యం.”

డైలీ SIPల ప్రారంభంతో,ఫోన్‌పే వెల్త్ పెట్టుబడులను ప్రజాస్వామ్యం చేయడం అలానే సంపద సృష్టిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం పట్ల తన నిబద్ధతను బలోపేతం చేస్తుంది. వినియోగదారులు, వారికి అనుకూలమైన చిన్న అమౌంట్​లతో ప్రారంభించడానికి వీలు కల్పించడం అలానే సౌకర్యవంతమైన, వినియోగదారు-స్నేహపూర్వక పెట్టుబడి అనుభవాన్ని అందించడం ద్వారా,ఫోన్‌పే వెల్త్ మొదటిసారి పెట్టుబడి పెట్టేవారిని, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులని కాలక్రమేణా సంపదను నిర్మించుకోవడానికి శక్తినిస్తుంది. ఆదాయ వర్గాలలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడం అలానే క్రమశిక్షణతో కూడిన, దీర్ఘకాలిక పెట్టుబడి సంస్కృతిని పెంపొందించాలనే ఫోన్‌పే ప్లాట్‌ఫామ్ లక్ష్యాన్ని ఈ చొరవ మరింత బలోపేతం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -