Saturday, December 27, 2025
E-PAPER
Homeకరీంనగర్కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ విస్తరణకు దరఖాస్తుల స్వీకరణ

కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ విస్తరణకు దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గంలో చోటు కోసం ఉత్సాహంగా దరఖాస్తులు సమర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ విస్తరణ కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 10గం.ల నుంచి ప్రారంభమై సాయంత్రం 4గం.ల వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో కలిసి పిసిసి పరిశీలకులు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డిలు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వీకరించిన దరఖాస్తులను పిసిసి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి పరిశీలించి అర్హులైన వారికి పదవులను కేటాయించనున్నట్లు తెలిపారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సుమారు 150 దరఖాస్తులను స్వీకరించినట్లు పరిశీలకు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న నాయకులు కార్యకర్తలు అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ నాయకులు సాహెబ్, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్, వేములవాడ బ్లాక్ అద్యక్షులు సాగరం వెంకటస్వామి, కొమురయ్య, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, రాచర్ల గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సాహెదా బేగం గౌస్, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, కొండూరి గాంధీరావు, గొట్టే రుక్మిణి, కూతురు వెంకటరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రెడ్డిమల్ల భాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -