- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో నూతనంగా ఎన్నుకోబడిన పంచాయతీ పాలకవర్గాన్ని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ బండి ప్రవీణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… నా మీద నమ్మకం ఉంచి, గెలిపించిన గ్రామ ప్రజలకు బాధ్యతగా సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి పాలకవర్గం కట్టుబడి ఉందని అన్నారు. ఏ సమస్య ఉన్న ప్రజలు మా దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు పిప్పిరి లింబాద్రి, చింతకుంట భాస్కర్, వడ్డెర సంఘం పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



