Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదిరాజ్ సర్పంచుల సన్మాన సభను విజయవంతం చేయాలి

ముదిరాజ్ సర్పంచుల సన్మాన సభను విజయవంతం చేయాలి

- Advertisement -

భువనగిరిలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – భువనగిరి

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గెలుపొందిన ముదిరాజ్ సర్పంచులకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో  నిర్వహ్ంచే ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన సభను జయప్రదం చేయాలని ముదిరాజ్ సమన్వయ కమిటీ నాయకులు పిట్టల అశోక్, పిట్టల బాలరాజు, గుర్రాల శివ నాగేందర్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి క్లబ్ ఆవరణలో సన్మాన సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన ముదిరాజ్ సర్పంచులకు తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు, యువజన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ముదిరాజ్ కోపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజులు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గెలుపొందిన ముదిరాజ్ సర్పంచులు సన్మాన సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కుక్కదువు సోమయ్య, సాదు విజయకుమార్, ఉడుత భాస్కర్, ఎనబోయిన జాంగిర్, బోయిని బాలయ్య, చాగంటి నరసింహ, బిస్కుంట సత్యనారాయణ, దిడ్డికాడి భగత్, గుర్రాల మల్లేష్, డొప్ప వెంకటేష్, జిన్న మల్లేష్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -