Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం.

గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం.

- Advertisement -

వేముల జగ్గారావు జ్ఞాపకార్థంగా అందించిన కుటుంబ సభ్యులు

నవతెలంగాణ – మలహార్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామంలో గత సంవత్సరం మరణించిన వేముల జగ్గారావు జ్ఞాపకార్థంగా వారి కొడుకు వేముల నర్సింగారావు, కోడలు రాణి,కుటుంబ సభ్యులు కలిసి సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ రెడ్డి, ఉపసర్పంచ్ కటకం స్వప్న నరేష్, కార్యదర్శి హరీష్, పాలక వర్గానికి వైకుంఠ రథం అందించడం జరిగింది .

ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ మా నాన్న జ్ఞాపకార్థం ఊరికి ఏమైనా చేయాలని ఉద్దేశంతో మా కుటుంబం తరఫున గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని గ్రామ ప్రజల అంతిమయాత్రలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని, వారికి అండగా ఉండాలని మా కుటుంబ నిర్ణయించి ఈ వైకుంఠ రథం ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ మాట్లాడుతూ వారి కుటుంబం అభినందిస్తూ గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక దూరం ఉండడం వలన అంతిమ సంస్కారానికి చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి గ్రామ ప్రజల సమస్య పరిష్కరించడానికి వాళ్లు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గతంలో వారి నాన్న కళ్ళను ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు దానం చేయడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సందర్బంగా పాలక వర్గం కుటుంబ సభ్యులని శాలువాతో ఘనంగా సన్మానించాడ జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూతురు, కొడుకు, అల్లుడు,మనవళ్లు, మనవరాలు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -