- Advertisement -
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శి రేండ్ల తిరుపతిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శుక్రవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్‌లో ప్రస్తుత కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు నుంచి తిరుపతి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి తిరుపతికి ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన… స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనమండలి కార్యదర్శిగా వి. నరసింహాచార్యులు కొనసాగుతారు.
- Advertisement -



