నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది సంక్రాంతి పండుగ రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకురానుంది. ప్రభుత్వం తొలుత ప్రకటించిన ఐదు రోజుల సెలవులను సవరిస్తూ ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత మే నెలలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11 నుంచి 15 వరకు ఐదు రోజులు సెలవులుగా నిర్ణయించారు. అయితే, జనవరి 10వ తేదీ రెండో శనివారం కావడంతో సెలవులు ఒక రోజు ముందే ప్రారంభం కానున్నాయి. అటు ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలను అధికారికంగా ప్రకటించడంతో సెలవుల షెడ్యూల్‌ను పునఃసమీక్షించాల్సి వచ్చింది. సెలవుల కొత్త షెడ్యూల్ (ప్రతిపాదిత) ప్రకారం.. జనవరి 10న రెండో శనివారం సెలవు, 11న ఆదివారం సాధారణ సెలవు, 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు కాబట్టి పాఠశాలలు తిరిగి 17న ప్రారంభం కానున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, 17 శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ప్రకటిస్తే పాఠశాలలు తిరిగి 19న తెరుచుకుంటాయి.
సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



