- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చలితీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల కనిష్టానికి పడిపోనున్నట్లు తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
- Advertisement -



