- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితరులు పాల్గొననున్నారు.
- Advertisement -



