- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మాసాబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఈగల్ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఈ నెల 17న ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విని అరెస్టు చేశారు. వారిని విచారించగా అమన్‌ప్రీత్ పేరు బయటకు వచ్చింది.
ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్ కొన్నట్టు ఈగల్ టీమ్ గుర్తించింది. ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. గతేడాది కూడా అమన్‌ప్రీత్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. మరోవైపు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వికి మరో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -



